ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి: ఎప్పటినుంచంటే?

తాజా వార్తలు

Updated : 29/12/2020 17:51 IST

ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి: ఎప్పటినుంచంటే?

పెరగనున్న కార్ల ధరలు?

దిల్లీ: కార్లు తదితర పాసింజర్‌ వాహనాల ముందు సీట్లో కూడా ఎయిర్‌బ్యాగుల ఏర్పాటును తప్పనిసరి చేయాలనే నిబంధన త్వరలోనే భారత్‌లో అమలులోకి రానుంది. ఇప్పటి వరకు డ్రైవర్‌ సీటు వద్ద మాత్రమే ఎయిర్‌ బ్యాగు తప్పనిసరి కాగా.. ఇకపై ముందువరుసలో డ్రైవర్‌ పక్కన ఉండే సీటు వద్ద కూడా ఈ ఏర్పాటు అనివార్యం కానుంది.

ఈ తేదీ లోగా మార్చాలి..

ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ నేడు ఓ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కారు ముందు వైపు ఉండే పాసింజర్‌ సీటులో కూడా ఎయిర్‌ బ్యాగు ఉండాలనే నిబంధనకు అనుగుణంగా వాహనదారులు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను కొత్త మోడల్‌ కార్లకు ఏప్రిల్‌ 1, 2021 వరకు.. ఇప్పటికే వాడుతున్న కార్లకు జూన్ 1, 2021 గడువు తేదీగా నిర్ణయించారు. ఎయిర్‌ బ్యాగుల ప్రమాణాలను గురించి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్) ఆదేశాలు వెలువడేంత వరకు.. అవి ఏఐఎస్‌ 145 నిబంధనకు అనుగుణంగా ఉండాలని ఈ నోటిఫికేషన్‌లో సూచించారు. అంతేకాకుండా భవిష్యత్తులో తయారుచేసే వాహనాల్లో ప్రయాణికుల సీట్లలో కూడా ఎయిర్‌ బ్యాగులను అమర్చేలా ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌ (ఏఐఎస్‌) నియమావళిలో మార్పులు చేయనున్నారు.

కార్ల ధరల పెరుగుదల?

వేగాన్ని సూచించే స్పీడ్‌ అలెర్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు, సీట్‌ బెల్ట్‌ రిమైండర్లు వంటివి ఇప్పటికే ఇంచుమించి అన్ని కార్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఐతే ప్రాణాలను కాపాడే ఎయిర్‌ బ్యగులను ఇప్పటికీ తప్పనిసరి చేయకపోవటం గమనార్హం. ప్రమాదం లేదా యాక్సిడెంట్‌ సంభవించినప్పుడు ప్రయాణికులను రక్షించేలా పూర్తి ఏర్పాట్లు ఉండాలని.. ఖరీదుతో నిమిత్తం లేకుండా అన్ని కార్లలో సంబంధిత ఏర్పాట్లు ఉండి తీరాల్సిందేనని ప్రభుత్వం భావిస్తున్నట్టు రవాణా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.  అయితే తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. సాధారణ కార్ల ధరలు రూ.5 వేల నుంచి 8 వేల వరకు పెరిగే అవకాశాలున్నాయి.

అభ్యంతరాలుంటే..

జులై 1, 2019 నుంచి అన్నికార్లలోని డ్రైవర్‌ సీట్లో ఎయిర్‌ బ్యాగును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఐతే డ్రైవర్‌ సీటు పక్కన కూర్చొనే ప్రయాణికులకు కూడా అంతే ప్రమాదం పొంచి ఉంటుందనేది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో తాజా మార్పులు చేసేందుకు కేంద్రం సంకల్పించింది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవధి 30 రోజుల్లో పూర్తవుతుందని.. ఈ విషయమై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలున్న వారు దానిని రవాణా శాఖ జాయింట్‌ సెక్రటరీ దృష్టిలోకి తీసుకురావాల్సిందిగా  అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి..

ధరలు పెంచనున్న స్కోడా..

వచ్చే ఏడాది భారత్‌లో టెస్లా కార్లుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని