ఏలియన్స్‌ ఉన్నాయ్‌.. అది ట్రంప్‌కీ తెలుసు

తాజా వార్తలు

Published : 09/12/2020 12:37 IST

ఏలియన్స్‌ ఉన్నాయ్‌.. అది ట్రంప్‌కీ తెలుసు

ఇజ్రాయెల్‌ స్పేస్‌ సెక్యూరిటీ మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా’‌.. ఎన్నో ఏళ్లుగా మానవాళికి అంతుచిక్కని రహస్యం ఇది. ఏలియన్స్‌ ఉన్నాయని కొందరు నమ్ముతుంటే.. అలాంటిదేమీ లేదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే తాజాగా ఇజ్రాయెల్‌ అంతరిక్ష భదత్ర మాజీ చీఫ్‌ హేమ్‌ ఇషెద్‌ గ్రహాంతరవాసుల అస్థిత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కూడా ఆ నిజం తెలుసని అన్నారు. గ్రహాంతరవాసులను అంగీకరించేందుకు మానవుడు ఇప్పుడే సిద్ధంగా లేనందున అమెరికా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. 

హేమ్‌ ఇషెద్‌ ఇటీవల ఓ ప్రముఖ ఇజ్రాయెల్‌ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో గ్రహాంతర జీవి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేగాక, ఏలియన్స్‌‘గెలాక్సీ సమాఖ్య’, అమెరికా ప్రభుత్వానికి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందని ఇషెద్‌ తెలిపారు. విశ్వం రహస్యాలపై పరిశోధనలు చేసేందుకు యూఎస్‌ వ్యోమగాములు.. గ్రహాంతరవాసులతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌నకు కూడా ఈ నిజం తెలుసని, అయితే ప్రజలు కంగారుపడతారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదని చెప్పారు. అంతరిక్షం, స్సేస్‌షిప్‌ల గురించి మానవులకు పూర్తిగా అర్థమైన తర్వాతే తమ అస్థిత్వం గురించి బయటపెట్టాలని ఏలియన్స్‌ అమెరికాకు చెప్పినట్లు ఇషెద్‌ పేర్కొన్నారు. 

‘2020లో మనం చాలా సంచలనాలు చూశాం. ఇక 2021లోనూ మరో అద్భుతం జరిగే సమయం ఆసన్నమైంది’ అని ఇషెద్‌ అన్నారు. ఏలియన్స్‌ విషయాన్ని తాను ఐదేళ్ల కిందట గనుక చెబితే ఇప్పుడు ఆసుపత్రిలో ఉండేవాడినని ఇషెద్‌ అన్నారు. తాను రాసిన ‘ది యూనివర్స్ బియాండ్‌ ది హారిజన్‌’ అనే పుస్తకంలోనూ ఇషెద్‌ ఈ విషయాలను పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త వ్యాఖ్యలపై అటు అమెరికా ప్రభుత్వం గానీ.. డొనాల్డ్‌ ట్రంప్‌గానీ ఇంతవరకూ స్పందించలేదు. కానీ.. ఇషెద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యంగ్య మీమ్స్‌ పెడుతున్నారు. 87ఏళ్ల ఇషెద్‌.. ఇజ్రాయెల్‌ స్పేస్‌ సెక్యూరిటీకి దాదాపు మూడు దశాబ్దాల పాటు చీఫ్‌గా పనిచేశారు.

ఇదిలా ఉండగా.. భూమికి ఆవల జీవనాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఎప్పుడూ పూర్తిగా కొట్టిపారేయలేదు. గతేడాది అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘స్పేస్‌ఫోర్స్‌’ పేరుతో సైన్యంలో కొత్త విభాగాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలో శాటిలైట్లు, కమ్యూనికేషన్‌ను పరిరక్షించుకోవడంతో పాటు భౌగోళిక రాజకీయాలపై ఈ ఫోర్స్‌ దృష్టిపెడుతుందని ఆ సమయంలో ట్రంప్‌ తెలిపారు. 

ఇవీ చదవండి..

కలవరపెడుతున్న ఏకశిలల రహస్యం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని