భాజపాతో పొత్తులోనే అసెంబ్లీ ఎన్నికలకు: పళని
close

తాజా వార్తలు

Published : 21/11/2020 19:21 IST

భాజపాతో పొత్తులోనే అసెంబ్లీ ఎన్నికలకు: పళని

చెన్నై: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే నేత, సీఎం పళనిస్వామి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాష్ట్ర పర్యటనలో ఉన్న సందర్భంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పళనిస్వామి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాతో మా పొత్తు కొనసాగుతుంది. మేం సంవత్సరాల తరబడి మంచి పరిపాలన అందజేశాం. 2021లో మా కూటమి విజయం సాధిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని అన్నారు. 

అమిత్‌షా మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటం విషయంలో తమిళనాడు ప్రభుత్వం గొప్పగా పనిచేసింది. కేంద్రం విడుదల చేసిన మంచి పరిపాలన అందించిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడిలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం సఫలం అయ్యారు. తమిళనాడులో కరోనా రికవరీ రేటు అధికంగా ఉంది. తమిళనాడులో తీసుకుంటున్న జాగ్రత్త ప్రమాణాలు బాగున్నాయి. గర్భిణీల కోసం ఈ రాష్ట్రంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరే రాష్ట్రంలో తీసుకోవడం లేదు’ అని అమిత్‌షా ప్రశంసలు గుప్పించారు.

తమిళనాడులో తొమ్మిదేళ్లుగా ఏఐఏడీఎంకే పార్టీ అధికారంలో ఉంది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ఏఐడీఎంకే నాయకురాలు జయలలిత డీఎంకేను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2016 ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం డీఎంకే నేతృత్వంలోని కూటమి 39లోక్‌సభ స్థానాలకు గానూ 38 స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం. కాగా తమిళనాడు పర్యటనలో భాగంగా శనివారం చెన్నైకి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ మురుగన్‌ స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక అమిత్‌షా కారు దిగి రోడ్డుపై నడుస్తూ కార్యకర్తలను ఆనందపరిచారు. 

ఇదీ చదవండి

చెన్నైలో రోడ్డుపై కాలినడకన అమిత్‌షా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని