close

తాజా వార్తలు

Published : 03/12/2020 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు నిరసన.. దేశ భద్రతా సమస్య

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు పంజాబ్ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే ప్రభావం చూపవని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని కేంద్రం, రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

‘కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు. నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, దేశ భద్రతను ప్రభావితం చేసే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరాను’ అని అమరీందర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. దిల్లీలో ఆయన అమిత్ షాను రైతుల సమస్యలపై చర్చించారు. రెండో విడత రైతులతో కేంద్రం చర్చలకు సిద్ధమవుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. 

కాగా, చలి తీవ్రతను లెక్క చేయకుండా ఎనిమిది రోజులుగా దిల్లీ శివారుల్లో రైతులు రహదారులపైనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సింఘు, టిక్రి వద్ద వేలాది మంది శాంతియుతంగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి చర్చలు జరుగుతుండటంతో.. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన