అమెరికాకు మరో 100 మిలియన్‌ డోసుల టీకా
close

తాజా వార్తలు

Published : 12/12/2020 09:54 IST

అమెరికాకు మరో 100 మిలియన్‌ డోసుల టీకా

మోడెర్నాతో కొత్త కొనుగోలు ఒప్పందం

వాషింగ్టన్‌: కరోనా టీకా తయారు చేస్తున్న మోడెర్నా నుంచి మరో 100 మిలియన్ల అదనపు డోసుల్ని కొనుగోలు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో ఈ సంస్థ నుంచి మొత్తం 200 మిలియన్ల డోసుల్ని అమెరికా కొనుగోలు చేయనుంది. వ్యాక్సిన్‌ తయారుచేస్తున్న మరో సంస్థ ఫైజర్‌ నుంచి ఇక అదనపు డోసుల్ని కొనుగోలు చేసే అవకాశాన్ని అమెరికా కోల్పోయిందని వార్తలు వచ్చాయి. దీంతో టీకా కొరత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో మోడెర్నాతో చేసుకున్న ఒప్పందం అమెరికావాసులకు ఊరట కలిగించింది.

కొత్త కొనుగోలు ఒప్పందం ప్రకారం.. 2021 రెండో త్రైమాసికం నాటికి కావాల్సిన కరోనా టీకాలను అందజేస్తామని మోడెర్నా ప్రకటించింది. తొలుత చేసుకున్న ఒప్పందంలోని డోసుల్ని మాత్రం తొలి త్రైమాసికానికే అందజేస్తామన్నారు. ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌ కార్యక్రమం కింద అమెరికా ఇప్పటికే పలు కరోనా టీకాల కొనుగోలు కోసం ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

పైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఇటీవలే నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపడంతో ఎఫ్‌డీఏ ఆమోదం లభించడం లాంఛనమే. ఇక మోడెర్నా టీకాపైనా ప్రత్యేక కమిటీ సమీక్ష నిర్వహించనుంది. దాదాపు ఈ టీకాకు కూడా అనుమతులు లభించడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందించనవే కావడం విశేషం.

ఇవీ చదవండి..
కొవి షీల్డ్.. నెలకు 10 కోట్ల డోసులు

అత్యుత్తమ వ్యాక్సిన్‌ అందించే సత్తా భారత్‌కు ఉంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని