పాత చట్టాలతో నవశకాన్ని నిర్మించలేం: మోదీ

తాజా వార్తలు

Published : 07/12/2020 18:41 IST

పాత చట్టాలతో నవశకాన్ని నిర్మించలేం: మోదీ

లఖ్‌నవూ: దేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ వైపు దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈమేరకు మంగళవారం నిర్వహించిన ఆగ్రా మెట్రో రైల్‌ ప్రాజెక్టు వర్చువల్‌ ప్రారంభ కార్యక్రమంలో మోదీ వెల్లడించారు. 

‘దేశంలో కొత్త చట్టాలు తెచ్చి అభివృద్ధి చేసేందుకు సంస్కరణలు చేపట్టడం ఎంతో అవసరం. గత శతాబ్దంలో తయారు చేసిన చట్టాలతో మనం కొత్త శకాన్ని నిర్మించలేం. గత శతాబ్దంలో మంచిగా ఉపయోగపడిన చట్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారంగా మారాయి. కాబట్టి సంస్కరణలు చేపట్టడం ఎంతో ఆవశ్యకం. అందుకే మా ప్రభుత్వం పూర్తిగా సంస్కరణలను ప్రోత్సహిస్తోంది. ఇటీవలి కాలంలో మా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. అందుకు తాజాగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం’ అని మోదీ వెల్లడించారు. అదేవిధంగా దేశంలో రూ.100లక్షల కోట్లతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం మొదలైనట్లు మోదీ పేర్కొన్నారు.  

ఇదీ చదవండి

రైతుల వద్దకు కేజ్రీవాల్‌

పోలీసుల అదుపులో అఖిలేశ్‌యాదవ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని