close

తాజా వార్తలు

Published : 03/12/2020 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతులతో చర్చలు: అమిత్ షా కీలకభేటీ

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో రెండో విడత చర్చలకు కేంద్రం సమాయత్తమవుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీలు నిర్వహించారు. తొలుత కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో సమావేశమైన షా.. ఆ తర్వాత కాసేపటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో మాట్లాడారు. రైతు సమస్యలపై నిర్ణయం తీసుకునేందుకు అమిత్ షా వీరితో భేటీ అయ్యారు. రైతుల ఆందోళనకు బహిరంగంగా మద్దతు తెలిపిన పంజాబ్‌ సీఎం కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర శాసనసభలో పలు చట్టాలు చేసిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం తోమర్‌ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

విజ్ఞాన్‌భవన్‌లో రైతు ప్రతినిధులు

మరోవైపు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 40 రైతు సంఘాల ప్రతినిధులు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌కు చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు వీరితో సమావేశం కానున్నారు. నూతన చట్టాలతో పాటు, విద్యుత్‌ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే తమ అభ్యంతరాలను అన్నదాతలు లిఖితపూర్వకంగా కేంద్రానికి సమర్పించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గణతంత్రదినోత్సవం పరేడ్‌లో ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

మోసం చేసినట్లే: రాహుల్‌

రైతులతో కేంద్రం చర్చలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. కొత్త వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కితీసుకోకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా యావత్‌ భారతావనిని, దేశ రైతులను మోసం చేసినట్లే అవుతుందని రాహుల్‌ పేర్కొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన