close

తాజా వార్తలు

1న నిర్భయ దోషులకు ఉరి పడేనా..?

సుప్రీంకోర్టులో మరో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు శిక్ష అమలు వాయిదా పడేలా దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకడైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా మరో దోషి అక్షయ్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్థానంలో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. 

ఉరిశిక్ష అమలుకు నాలుగు రోజులు ముందు మంగళవారం రాత్రి అక్షయ్‌ తన చిట్టచివరి న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ అతడు క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తీహాడ్‌ డీజీ వెల్లడించారు. గత నెల అక్షయ్‌ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజా క్యురేటివ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు నేడు ఛాంబర్లలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించినా.. అతడు రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకునే అవకాశం కూడా మిగిలి ఉంది. ఈ కేసులో మరో ఇద్దరు దోషులు ముకేశ్‌, వినయ్‌ శర్మ్‌ వేసిన క్యురేటివ్‌ పిటిషన్లను ఇప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

ఇదిలా ఉండగా.. క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషి ముకేశ్‌ కుమార్‌ సింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రపతి ఎలాంటి ఆలోచన చేయకుండానే తన అభ్యర్థనను తిరస్కరించారని ముకేశ్ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. రాష్ట్రపతి వేగంగా తిరస్కరించారంటే దానర్థం ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది. 

ఉరి తేదీ దగ్గరపడుతున్న సమయంలో దోషులు ఇలా పిటిషన్లు వేయడం.. శిక్ష అమలును ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా కన్పిస్తున్నాయి. నిజానికి దోషులను జనవరి 22నే ఉరితీయాల్సి ఉండగా.. ముకేశ్‌ క్షమాభిక్ష అభ్యర్థన ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. తాజా పరిణామాలను చూస్తుంటే ఈసారి కూడా దోషులను ఉరితీస్తారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: క్షమాభిక్ష తిరస్కరణపై పిటిషన్‌ కొట్టివేత


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.