close

తాజా వార్తలు

Published : 24/09/2020 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాలో కరోనా: మరో గవర్నర్‌కు పాజిటివ్‌

వాషింగ్టన్‌: అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ముస్సోరీ ప్రథమ పౌరుడు మైక్‌ పార్సన్‌కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన సతీమణి టెరెసా పార్సన్‌కు కూడా కొవిడ్‌-19 సోకినట్టు అధికారులు వివరించారు. కాగా, 65 సంవత్సరాల పార్సన్‌ ఈ వ్యాధి సోకిన రెండవ అమెరికన్‌ గవర్నర్ కావటం గమనార్హం. ఇంతకుముందు ఓక్లహామా గవర్నర్‌ కెవిన్‌ స్టిట్‌కు జులైలో కరోనా సోకిన సంగతి తెలిసిందే.

‘‘ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఏ విధమైన కొవిడ్‌ లక్షణాలు కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం మేము క్వారంటైన్‌ నియమాలను అనుసరిస్తున్నాము.’’ అని మైక్‌ పార్సన్‌ ఓ వీడియో ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ పార్సన్‌ వారం రోజుల పాటు అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ముస్సోరీ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,18,000కు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 1938 మరణాలు సంభవించినట్టు తెలిసింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.