close

తాజా వార్తలు

Published : 21/10/2020 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనాకు తగలనున్న మరో షాక్‌..

విదేశీ విద్యాసంస్థల ఒప్పందాలపై భారత్‌ ఆంక్షలు

దిల్లీ: ప్రభుత్వ అనుమతి పొందే అవసరం లేకుండానే విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా సంస్థల ముసుగులో పొరుగున ఉన్న డ్రాగన్ మన దేశంలో కార్యకలాపాలను సాగించడాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా త్వరలోనే ఓ నిబంధన అమలులోకి రానున్నట్టు తెలిసింది. భారతీయ విశ్వవిద్యాలయాలు దేశ సరిహద్దుల్లో ఉన్న ఏ దేశానికి చెందిన విద్యాసంస్థతో అయినా అవగాహనా ఒప్పందానికి  (ఎంఓయూ) వచ్చే ముందు.. విద్యా శాఖ  అనుమతి పొందటం ఇకపై తప్పనిసరి కానుంది. ఈ అంశంపై తాము విద్యాశాఖతో విస్తృత చర్చలు జరిపామని.. ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విదేశీ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి.

విద్యా కార్యక్రమాల ముసుగులో..

చైనా సహకారంతో నడుస్తున్న కన్ఫ్యూషియస్‌ ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రాల గురించి ఆగస్టు 9 నాటి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. చైనా భాష, సంస్కృతుల ప్రచారం కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాలు.. రూపు మార్చుకుని చైనా రాజకీయ విధానాలను, దృక్పధాన్ని ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణలు తలెత్తాయి. ఈ కేంద్రాలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నడుస్తుండటం  గమనార్హం. కాగా భారత్‌తో సహా అమెరికా, ఆస్ట్రేలియా తదితర పలుదేశాలు ఈ కేంద్రాల కార్యకలాపాల పట్ల అనుమానాలు వ్యక్తం చేశాయి.

చైనాకు చెందిన కన్ఫ్యూషియస్‌ ఇన్‌స్టిట్యూట్‌తో.. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, ముంబయి యూనివర్సిటీ, కోల్‌కతా స్కూల్‌ ఆఫ్‌ చైనీస్‌ లాంగ్వేజెస్, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ దిల్లీ, ఐఐటీ గువాహటి, ఐఐటీ గాంధీనగర్‌, ఐఐటీ రూర్కీ, ఐఐటీ భువనేశ్వర్‌ తదితర విద్యాసంస్థలు ఇప్పటికే ఎంవోయూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఒప్పందాలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆయా విద్యా సంస్థలను ఆదేశించింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.