
తాజా వార్తలు
బైడెన్ బృందంలో మరో భారతీయ-అమెరికన్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా బృందంలో మరో భారతీయ-అమెరికన్‌కు చోటు లభించడం లాంఛనంగా కనిపిస్తోంది. బడ్జెట్ చీఫ్‌గా నీరా టాండెన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం ఓ కథనంలో పేర్కొంది. అలాగే బైడెన్ ఆర్థిక వ్యవహారాల బృందంలో ఉండనున్న మరికొంత మంది పేర్లను కూడా ప్రచురించింది. నూతన అధ్యక్షుడి ఎంపికను బట్టి బైడెన్ ఆర్థిక విధానం ఉదారంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇప్పటికే భారతీయ మూలాలున్న వివేక్ మూర్తి, రాజు శెట్టి బైడెన్ సలహాదారులుగా చేరగా.. మాల అడిగా కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు సీనియర్ సలహాదారుగా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం ‘సెంటర్ ఫర్ అమెరికన్ ప్రొగ్రెస్’ అనే మేధోసంస్థకు అధ్యక్షత వహిస్తున్న టాండెన్.. బైడెన్ బృందంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ హోదాలో ఆమె బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అనేక మంది ఆర్థిక నిపుణులు, సలహాదారులకు నేతృత్వం వహించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు సంబంధించి అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఒబామా హయాంలో టాండెన్ హెల్త్‌కేర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, 2016 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచార బృందంలోనూ పనిచేశారు.
ప్రెస్ టీంలో అంతా మహిళలే..
శ్వేతసౌధం సమాచార బృందం(కమ్యూనికేషన్స్ టీం)లో మొత్తం మహిళలకే చోటుదక్కింది. ఎన్నికల్లో బైడెన్ ప్రచార బృందానికి డైరెక్టర్‌గా వ్యవహరించిన కేట్ బెడింగ్‌ఫీల్డ్ శ్వేతసౌధం ప్రెస్ టీంకి నేతృత్వం వహించనున్నారు. డెమొక్రాటిక్ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జెన్ సాకి.. బైడెన్‌కు ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. వీరివురికి ఒబామా హయాంలో పనిచేసిన అనుభవం ఉంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న కర్నీ జీన్ పియరీ బైడెన్‌కు ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొత్తం ఏడుగురు సభ్యుల బృందంలో అందరూ మహిళలే ఉండడం విశేషం. ఇలా జరగడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
ఎక్కువ మంది చదివినవి (Most Read)
