‘ఆత్మనిర్భర్‌ భారత్’ మంచి ప్రయత్నం: ఐఎంఎఫ్

తాజా వార్తలు

Published : 26/09/2020 01:19 IST

‘ఆత్మనిర్భర్‌ భారత్’ మంచి ప్రయత్నం: ఐఎంఎఫ్

వాషింగ్టన్‌: భారతదేశ స్వయం సమృద్ధి సాధనకు ‘ఆత్మ నిర్భర్‌ భారత్’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మంచి ప్రయత్నమంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. దీనికి సంబంధించి ఆ సంస్థ ఉన్నతాధికారి గెర్రీ రైస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్ పేరిట ప్రకటించిన ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చిందని, భారీ నష్టాలను తగ్గించిందని ప్రశంసించారు. 

‘‘మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేసే విధానాలపై దృష్టిపెట్టాలి. మోదీ చెప్పినట్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషించాలంటే..ఆర్థిక వ్యవస్థ  సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని మెరుగుపరిచి, ఉత్తేజమైన విధానాలను అనుసరించడం చాలా అవసరం’ అని  రైస్ అభిప్రాయపడ్డారు. 

కాగా, ఆరోగ్య సంబంధిత స్థిరమైన లక్ష్యాలలో అధిక పనితీరును సాధించడానికి ఆరోగ్య రంగంలో పెట్టే వ్యయాన్ని క్రమంగా పెంచాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి ఐఎంఎఫ్ చేసిన అధ్యయనం వెల్లడిచేస్తుందని రైస్ తెలిపారు. స్థిరమైన వృద్ధిని సాధించడానికి నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని  గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని