ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌: స్కాట్‌ మోరిసన్‌

తాజా వార్తలు

Published : 19/08/2020 01:36 IST

ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌: స్కాట్‌ మోరిసన్‌

మెల్‌బోర్న్‌: ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనికాతో ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలిపారు. స్వీడిస్‌ - బ్రిటిష్‌ ఫార్మా కంపెనీ అయిన ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ విజయవంతమైతే తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ఆస్ట్రేలియా పౌరులందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచుతామని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. 

గత ఏడెనిమిది నెలలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలన్నీ  వ్యాక్సిన్‌ తయారీపై రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మూడో దశ ట్రయిల్స్‌లో ఉన్న ఐదు వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఒకటి. మూడో దశ ట్రయల్స్‌ సమర్థంగా కొనసాగుతున్న ఈ వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరికల్లా వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

ఆస్ట్రేలియా జనాభా 25 మిలియన్లకు పైగా ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 23,700మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 14,900 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 430మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని