close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023487 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => cpzRTyhNxsU [video_short_link] => cpzRTyhNxsU [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-02-18 20:06:57.003837 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

రేపు రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్టు తొలి భేటీ

దిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారం దిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలను ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. రామ మందిర నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించడం, మందిర నిర్మాణానికి ప్రజల నుంచి పారదర్శకంగా విరాళాల సేకరణ, భవిష్యత్తు కార్యచరణ వంటి కీలక అంశాలు సమావేశ అజెండాగా ఉన్నాయి. నిర్ణీత సమయంలోగా రామ మందిరాన్ని నిర్మించాలని ట్రస్టు ఆశిస్తోంది. ఇందుకు కాలవ్యవధిని నిర్ణయించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రజల నుంచి పారదర్శకంగా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విరాళాలు ఎలా సేకరించాలనే దానిపై కూడా ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. రామ మందిరం శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించడం సహా నిర్మాణ సమయంలో రాంలాలా విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలనేదానిపైన ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులు గల ఈ ట్రస్టుకు సీనియర్‌ న్యాయవాది పరాశరన్ నేతృత్వం వహిస్తున్నారు. 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.