బీరుట్‌ పేలుళ్లు: కస్టమ్స్‌ ఉన్నతాధికారి అరెస్టు

తాజా వార్తలు

Published : 18/08/2020 12:00 IST

బీరుట్‌ పేలుళ్లు: కస్టమ్స్‌ ఉన్నతాధికారి అరెస్టు

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుళ్లు ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆగస్టు 4న నౌకాశ్రయంలో జరిగిన పేలుళ్ల కారణంగా 10 నుంచి 15 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 180 మంది మృతిచెందగా 6 వేల మంది గాయపడ్డారు. 30 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ కస్టమ్స్‌ ఉన్నతాధికారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. 3 వేల టన్నుల పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ ఎక్కడినుంచి వచ్చింది, దానిని నౌకాశ్రయంలో ఉంచడానికి గల కారణాలను విచారిస్తోంది. 

పేలుళ్ల అనంతరం లభించిన కొన్ని పత్రాల ఆధారంగా 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ కొన్ని సంవత్సరాలుగా నౌకాశ్రయంలోనే నిలువచేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారులందరికీ తెలుసుననీ, కానీ ఆ పేలుడు పదార్థాలను ఇన్ని సంవత్సరాలుగా పోర్టులోనే ఉంచడానికి గల కారణాలను జడ్జి ఫాది స్వాన్‌ కస్టమ్స్‌ అధికారి బాద్రి దాహెర్‌ను ప్రశ్నించారు. పలు విషయాలపై ఇద్దరు లాయర్ల సమక్షంలో సోమవారం దాహెర్‌ను జడ్జి 4.30 గంటలపాటు విచారించారు. విచారణ ముగిసేంతవరకు దాహెర్‌ అధికారుల అదుపులోనే ఉండనున్నారు. ఈ విచారణపై లెబనాన్‌ అధ్యక్షుడు స్పందించారు. వినాశకరమైన పేలుళ్లపై దర్యాప్తు అత్యంత క్లిష్టతరంగా ఉంటుందని.. ఈ దర్యాప్తు అంత త్వరగా పూర్తయ్యే అంశం కాదని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని