బెంగాల్‌లో వారానికి రెండు రోజులు లాక్‌డౌన్‌
close

తాజా వార్తలు

Published : 20/07/2020 23:51 IST

బెంగాల్‌లో వారానికి రెండు రోజులు లాక్‌డౌన్‌

దిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పశ్చిమ బెంగాల్‌లో వారానికి రెండు రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పాటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపాన్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. ఈ వారంలో గురు, శనివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పాటించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. వైరస్‌ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారానికి 2 నుంచి 3 రోజుల లాక్‌డౌన్ మంచి ప్రభావాన్ని చూపుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. బెంగాల్‌లో ఇప్పటివరకు 42 వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవగా 1100 మంది మృతిచెందారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని