close

తాజా వార్తలు

Published : 13/07/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భాజపా ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లా బిందాల్ గ్రామంలో ఎమ్మెల్యే నివాసానికి సమీపంలోని మార్కెట్‌లో ఆయన ఉరివేసుకున్నట్లు ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవేంద్రనాథ్‌ను హత్య చేసి.. అనంతరం ఉరి తీశారని బంధువులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హెమ్తాబాద్‌ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచిన దేవేంద్రనాథ్‌ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భాజపాలో చేరారు. ఎమ్యెల్యే దేవేంద్రనాథ్‌ మృతిపై భాజపా జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని