బాంబుల తయారీకి బెంగాల్ నిలయం: గవర్నర్‌
close

తాజా వార్తలు

Published : 20/09/2020 00:44 IST

బాంబుల తయారీకి బెంగాల్ నిలయం: గవర్నర్‌

ప్రభుత్వం, పోలీసు శాఖపై మరోసారి విమర్శలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బాంబుల తయారీకి నిలయంగా మారిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ ఆరోపించారు. శాంతిభద్రతలకు కలుగుతున్న ఆటంకాలపై పోలీసుశాఖ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేదని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం బెంగాల్‌తోపాటు కేరళలో అల్‌ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం ట్విటర్‌ వేదికగా గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తంగా చేసే అవకాశమున్న బాంబుల తయారీకి రాష్ట్రం నిలయంగా మారింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధీనంలోని పోలీసు శాఖ ప్రతిపక్షాలపై ప్రతాపం చూపే పనిలో పడింది. శాంతిభద్రతలకు కలుగుతున్న ఆటంకాలపై దృష్టిసారిండం లేదు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ వాస్తవాలకు దూరంగా జీవిస్తున్నట్లు ఆరోపించారు. ఏం జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలను పలుమార్లు వ్యతిరేకించిన గవర్నర్‌ మరోసారి మమతా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని