close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగళూరులో నేటినుంచి మళ్లీ లాక్‌డౌన్‌!

బెంగళూరు: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మహానగరాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కర్ణాటకలో వైరస్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2738పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం రాజధాని బెంగళూరుతోపాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది. నేటి సాయంత్రం(జులై 14) నుంచి జులై 22వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే అత్యవసర సేవలు, కిరాణ దుకాణాలతోపాటు మరికొన్నింటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు. 

మంగళవారం నాటికి రాష్ట్రంలో 41,581 కేసులు నమోదుకాగా 757 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో దాదాపు 25వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైద్యసేవలపై ఒత్తిడి పెరిగినట్లు రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో 2వేలు దాటిన మరణాలు..
దేశంలో మహారాష్ట్ర అనంతరం అత్యధిక కేసులు తమిళనాడులో నమోదవుతున్న విషయం తెలిసిందే. కేసులతోపాటు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 4328పాజటివ్‌ కేసులు నమోదుకాగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 2వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తం 1,42,798 మందికి వైరస్‌ సోకగా వారిలో 2032 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 90వేల మంది కోలుకోవడం ఊరట కలిగించే విషయం.

పుణెలోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. తాజాగా ఇక్కడ పరిస్థితి అదుపుచేసేందుకు నగరంలో సెక్షన్‌ 144ను విధించారు. 
గోవాలో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు 20శాతం పడకలను కొవిడ్‌ రోగులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
దిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతోపాటు రికవరీ రేటు 80శాతానికి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లలో రోజువారీ కేసుల సంఖ్య 15వందలు దాటింది.

ఇవీ చదవండి..
భారత్‌లో 9లక్షలు దాటిన కరోనా కేసులు..
యాంటీబాడీలు తగ్గిపోతున్నాయ్‌..!


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.