close

తాజా వార్తలు

Published : 23/05/2020 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కేసుల్లో రష్యాను దాటేసిన బ్రెజిల్‌

రెండో స్థానంలో నిలిచిన లాటిన్‌ అమెరికా దేశం

రియోడిజానీరో: గతనెల అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్‌ ఇప్పుడు లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌పై తన ప్రతాపం చూపుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ రోజుకు వెయ్యి మందికిపైగా మరిణిస్తున్నారు. దీంతో శుక్రవారం నాటికి మొత్తం మృతుల సంఖ్య 21 వేలు దాటిందని వైద్యాధికారులు వెల్లడించారు. మరోవైపు కేసుల సంఖ్య కూడా 3,30,890కు చేరిందన్నారు. దీంతో అత్యధిక కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్‌.. రష్యాను దాటి రెండో స్థానానికి చేరింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1001 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు.  

మరోవైపు బ్రెజిల్‌లో పేర్కొన్న అధికారిక గణాంకాల కన్నా ఆ కేసులు మరింత ఎక్కువే ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల ఆ దేశాన్ని ‘కొత్త కరోనా హాట్‌స్పాట్‌గా’ ప్రకటించింది. లాటిన్‌ అమెరికాలో చాలా దేశాలు కరోనాతో సతమతమవుతున్నాయని, ముఖ్యంగా బ్రెజిల్‌ పరిస్థితి దారుణంగా ఉందని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్‌ మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. ఇక అత్యధిక కేసుల జాబితాలో అమెరికా 16 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య 96 వేలుగా నమోదైంది. 3,26,488 కేసులతో రష్యా మూడో స్థానంలో నిలవగా, 3200 మంది మృతిచెందారు. బ్రెజిల్‌ ప్రస్తుతం మరణాల సంఖ్యలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ అంతకన్నా ముందున్నాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని