అమెరికా-చైనా ‘కోల్డ్‌వార్‌’పై చైనా ఏమన్నదంటే!
close

తాజా వార్తలు

Published : 24/05/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా-చైనా ‘కోల్డ్‌వార్‌’పై చైనా ఏమన్నదంటే!

బీజింగ్‌: చైనా-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బ తీసేందుకు అమెరికాలోని కొన్ని రాజకీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఈ నూతన ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ బీజింగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇది ఇరు దేశాలకు ప్రమాదకరమైందని వాంగ్‌ యీ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఇరుదేశాలు ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికి పరస్పర సహకారంతో ముందుకెళ్లడానికి శాంతియుత మార్గాన్ని కనుగొనాలని వాంగ్‌ యీ సూచించారు. హాంకాంగ్‌, మానవ హక్కులు, వాణిజ్యం, తైవాన్‌కు అమెరికా సహకారం వంటి విషయాల్లో ఇరుదేశాలు తలబడుతున్న సమయంలోనే కరోనా వైరస్‌ విజృంభణతో వీటి మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

ఈ సందర్భంలో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాలు నూతన విధానాలను రూపొందించుకోవాలని వార్షిక మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. ఈ కీలకమైన సమయంలో అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తొలుత ఇరుదేశాలు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలను ఒకరినొకరు పంచుకొని మహమ్మారిపై కలిసి పోరాడాలన్నారు. ఈ సమయంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

చైనాపై వ్యాజ్యాలు చట్టవిరుద్దం...
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొవిడ్‌-19కు కారణం చైనా అని ఇప్పటికే పలు దేశాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. దీనిపై కూడా తాజాగా చైనా స్పందించింది. కొవిడ్‌-19 విషయంలో చైనాకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు వేస్తామనడానికి అంతర్జాతీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని చైనా విదేశాంగమంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ న్యాయ నియమాలను కాలరాసే ఇలాంటి నిర్ణయాలు సమర్థించదగినవి కావని..ఇవి చట్టవిరుద్ధమని వాంగ్‌ యీ అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల మాదిరిగానే చైనా కూడా కరోనా వైరస్‌ మహమ్మారికి బాధితదేశమేనని చెప్పారు. కేవలం చైనా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్ధేశంతోనే అమెరికాలోని కొన్ని శక్తులు (పొలిటికల్‌ వైరస్‌) అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని