close

తాజా వార్తలు

మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దగలిగామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. బిల్లుపై రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై రిజిజు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్‌ గాంధీ జీ... మీ కాంగ్రెస్‌ పార్టీ చట్టాలను ఉల్లంఘిస్తూ, అవలంబించిన విధానాల వల్ల అక్రమ వలసదారులు ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఇక్కడే స్థిరపడ్డారు. మీరు చేసిన తప్పులకు దిద్దుబాటు చర్యలు చేపట్టాం. దీనిలో భాగంగానే పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాం’ అని కిరణ్‌ రిజిజు తెలిపారు.

పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌)కు ఉభయ సభల్లో ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా అసోం, త్రిపురలో నిరసనలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అసోంలో నిన్న రాత్రి నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ గురువారం ఉదయం ప్రజలు రోడ్లపైకి చేరి నిరసనలు చేపట్టారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.