close

తాజా వార్తలు

పౌరసత్వ బిల్లును ప్రజలు ఆమోదించారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడం వెనుక ఎలాంటి రాజకీయ అజెండా లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేఅఆరు. ప్రతిపక్షాల నిరసనల నడుమ ఈ బిల్లును నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బిల్లును ప్రవేశపెట్టేందుకు లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. అనుకూలంగా 293 మంది సభ్యులు ఓటేశారు. ప్రస్తుతం బిల్లుపై చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘శరణార్థులకు పౌరసత్వం కల్పించే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చాం. ఇందులో ఎలాంటి రాజకీయ అజెండా లేదు. ఈ బిల్లు హక్కులను కల్పిస్తుంది కానీ తొలగించదు. 2014, 2019 ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టోలో పౌరసత్వ బిల్లు కూడా ఉంది. ప్రజలు కూడా తమ తీర్పుతో దీనికి ఆమోదం తెలిపారు. వివక్ష చూపించేందుకు ఈ బిల్లును తీసుకురాలేదు. శరణార్థులకు, చొరబాటుదారులకు మధ్య తేడాను విపక్షాలు తెలుసుకోవాలి’ అని అన్నారు. 

ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మణిపూర్‌ను ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఈ బిల్లుకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ తెలిపారు. ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.