close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీబీఎస్‌ఈ పరీక్షా కేంద్రాలు @ 15000 

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు జులై 1 నుంచి 15 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఇంతకుముందు ఈ పరీక్షల నిర్వహణ 3వేల కేంద్రాల్లో జరుగుతుందని ప్రకటించిన బోర్డు ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 12వేల సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు  కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి  రమేశ్‌ పోఖ్రియల్‌  సోమవారం వెల్లడించారు.దీంతో మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య 15వేలకు చేరింది. పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం నిబంధనలు పాటించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా, 10వ తరగతి పరీక్షలు ఈశాన్య దిల్లీ వరకే నిర్వహిస్తామని ఇప్పటికే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.