close

తాజా వార్తలు

Published : 27/11/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌-చైనాల మధ్య బలమైన అవగాహన

 డ్రాగన్‌ సైన్యం వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి స్పష్టమైన, లోతైన అవగాహన, సమన్వయం ఉన్నాయని గురువారం చైనా సైన్యం వెల్లడించింది. లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ నుంచి సైనిక దళాలను వాపస్‌ తీసుకొనే విషయంపై స్పందిస్తూ ఈ మేరకు తెలిపింది. ‘‘మొత్తం మీద 8వ విడత కోర్‌ కమాండర్ల స్థాయి చర్చలు జరిగిన తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉంది. సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన సమన్వయ సహకారాలను దీనిలో కూడా కొనసాగించాం. ఎల్‌ఏసీ ఉత్తర సెక్టార్‌లో సైనిక ఉపసంహరణకు ఇది చాలా కీలకం’’ అని చైనా సీనియర్‌ కర్నల్‌, చైనా నేషనల్‌ డిఫెన్స్‌ మినిస్ట్రీ ప్రతినిధి రెన్‌ గ్యూక్యింగ్‌ తెలిపారు. శాంతిస్థాపన కోసం తమ దేశ నాయకత్వాలు చేసుకొనే ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రీ పేర్కొన్నారు. సైనిక, దౌత్య స్థాయిల్లో  సంబంధాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని.. భారత్‌ కూడా ఇదే ఉద్దేశంతో ఉందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఫలితంగా ఇరు దేశాలు సరిహద్దుల్లో శాంతిని కొనసాగిస్తారని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో చెరో 50 వేల మంది సైనికులను మోహరించారు. దీంతోపాటు భారీగా ఆయుధాలను తరలించారు. ఓ పక్క లద్దాఖ్‌లో  ఉష్ణోగ్రతలు సున్నాకంటే తక్కువకు పడిపోవడంతో సైనిక ఉపసంహరణపై దృష్టిపెడుతున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన