చెరకు రైతులకు కేంద్రం తీపికబురు

తాజా వార్తలు

Published : 16/12/2020 21:36 IST

చెరకు రైతులకు కేంద్రం తీపికబురు

కేబినెట్‌లో కీలక నిర్ణయాలకు ఆమోదం

దిల్లీ: దేశవ్యాప్తంగా చెరకు రైతులకు ఉపశమనం కల్పిస్తూ పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. టన్నుకు రూ. 6000 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు స్పెక్ట్రం వేలానికి కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 

కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాతో మాట్లాడారు. 60లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రాయితీకి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ఏడాది డిమాండ్‌ కంటే ఎక్కువగా 310 లక్షల టన్నుల ఉత్పత్తి రావడంతో అటు చెరకు పరిశ్రమ.. ఇటు చెరకు రైతులు విక్రయాలు  లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అందుకే అన్నదాతలకు ఊరటనిస్తూ పంచదార ఎగుమతులపై రాయితీ కల్పిస్తున్నామన్నారు. రూ. 3,500 కోట్లతో ఈ సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రాయితీ నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని వెల్లడించారు. దీంతో 5 కోట్ల మంది రైతులు, 5లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని జావడేకర్‌ చెప్పుకొచ్చారు. గతేడాది కూడా దేశీయంగా చెరకు ఉత్పత్తి గణనీయంగా వచ్చింది. దీంతో అప్పుడు టన్నుకు రూ. 10,448 చొప్పున పంచదార ఎగుమతులపై కేంద్రం రాయితీ ఇచ్చింది. 

మార్చిలో స్పెక్ట్రం వేలం

అటు స్పెక్ట్రం వేలానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 20ఏళ్లకు పలు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రం వేలం వేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ద్వారా రూ. 3,92,332 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది మార్చిలో వేలం నిర్వహించనున్నట్లు కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. బిడ్ల ఆహ్వానికి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు. 

ఇదీ చదవండి..

ప్రభుత్వంతో పనయ్యేలా లేదు.. కమిటీ వేస్తాం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని