పెళ్లికి నిరాకరించిందని గంజాయి కేసు కుట్ర

తాజా వార్తలు

Updated : 28/06/2021 11:34 IST

పెళ్లికి నిరాకరించిందని గంజాయి కేసు కుట్ర

తిరువనంతపురం: తనతో పెళ్లికి ఆమె నిరాకరించిందనే అక్కసుతో గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నాడు ఓ వ్యక్తి. మాదకద్రవ్యాల అక్రమ నిల్వల కేసులో చివరకు అరెస్ట్‌ కూడా చేయించాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆ యువతి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్‌కు తిరువనంతపురంలోని లార్డ్స్‌ ఆసుపత్రి సీఈవో హరీశ్‌ హరిదాస్‌తో పరిచయం ఉంది. ఈ చనువుతో హరీశ్‌ పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె నిరాకరించి అతణ్ని దూరంగా పెట్టారు. శోభపై కోపం పెంచుకున్న హరీశ్‌.. ఆమె దగ్గర పనిచేసే వివేక్‌రాజ్‌ సాయంతో ఇంటి లోపల గంజాయి పెట్టించాడు. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. వీరి దర్యాప్తులో శోభా విశ్వనాథ్‌ను నిర్దోషిగా తేల్చారు. ఈ సందర్భంగా ‘ఈటీవీ’తో ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే ఇలాంటి అన్యాయాలపైన పోరాడతా. చాలామంది ఫోన్లు చేసి వారికి జరిగిన అన్యాయాల గురించి చెబుతున్నారు’ అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని