‘హక్కుల సాకుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం’
close

తాజా వార్తలు

Published : 21/10/2020 12:16 IST

‘హక్కుల సాకుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం’

ఐరాస మానవ హక్కుల కమిషనర్‌ వ్యాఖ్యలపై భారత్‌

దిల్లీ: దేశంలో స్వచ్ఛంద సంస్థలపై ఆంక్షలు, సామాజిక కార్యకర్తల అరెస్టులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కమిషన్‌లో మిషెల్‌ బ్యాచెలెట్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. మానవ హక్కుల సాకుతో చట్టాల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఐరాస మానవ హక్కుల సంఘం మరింత అవగాహనతో స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ప్రకటన విడదల చేశారు.

భారత్‌ స్వతంత్ర, సార్వభౌమ దేశమని..ఏ విషయంలోనైనా చట్టాలు చేసుకునే అధికారం ఉందని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ)పై స్పందించే అధికారం ఐరాసకు లేదని తేల్చి చెప్పారు. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని ఇటీవల భారత ప్రభుత్వం మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీనిపై బ్యాచెలెట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల పరిరక్షులు, స్వచ్ఛంద సంస్థల హక్కుల్ని కాపాడాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు బాసటగా నిలిచిన దేశం.. కొత్త చట్టాలతో గొంతుకను నొక్కేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల్ని తాజాగా భారత్‌ ఖండించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని