మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

తాజా వార్తలు

Published : 04/08/2020 20:01 IST

మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

దిల్లీ: దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వైరస్‌ బారిన పడగా, తాజాగా కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు హరియాణాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్ పురోహిత్‌, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. వరుసగా రెండో రోజు 50వేల కేసులు వెలుగుచూశాయి. 803 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు 12లక్షల 30వేల మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 5లక్షల 86వేల మందికి క్రియాశీలకంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని