
తాజా వార్తలు
ఆ నేతలపై జీవితకాల నిషేధం సరికాదు
దిల్లీ: నేరారోపణలు రుజువైన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు గురువారం అఫిడవిట్ సమర్పించింది.
నేరారోపణలు రుజువై శిక్ష పడిన నేతలను ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ ప్రముఖ న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రం తమ స్పందన తెలియజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేడు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జీవితకాలం నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది.
ఇప్పటికే కోర్టులో నేతలపై కేసుల సత్వర విచారణ అభ్యర్థన.. విచారణ దశలో ఉన్నందున ఈ విషయంలో మరో పిటిషన్ అవసరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఐపీసీ సెక్షన్ల ప్రకారం, ప్రజాప్రతినిధులపై శిక్షలు విధించే విషయంలో ఎలాంటి వివక్ష లేదని న్యాయస్థానానికి వెల్లడించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
