చాందని గ్రామం... చాలా భద్రం!
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాందని గ్రామం... చాలా భద్రం!

ఊరంతా వృద్ధులున్నా, కరోనా అడుగుపెట్టలేదు
 కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగాప్రవర్తనను మార్చుకోవడమే కారణం

అహ్మదాబాద్‌: కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలకు ఇప్పటివరకూ అసలు మహమ్మారి చొరబడనే లేదు! ఇందుక్కారణం... వైరస్‌ను అడ్డుకునేలా ప్రజలు వ్యక్తిగత ప్రవర్తనను మార్చుకుని, కఠినంగా దాన్ని అనుసరించడం. అలాంటిదే.. మెహ్సానా జిల్లా, బేచరాజీ తాలుకాలోని చాందని గ్రామం. ఇక్కడి యువకులంతా ఉపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ మంది వృద్ధులే ఉంటున్నారు. వైరస్‌ రెండో దశ ఉద్ధృతి రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నా... ఈ పల్లెలో ఒక్క కేసు కూడా లేదంటే విశేషమే మరి!

ఎలా సాధ్యమైందంటే...

ఈ గ్రామంలో సుమారు 100 మంది వృద్ధులున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను వీరంతా కచ్చితంగా, సరైన విధానంలో పాటిస్తున్నారు. గ్రామవాసులు ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఇతర ప్రాంతాల వారిని తమ గ్రామంలోకి రానివ్వడం లేదు. అందరూ మాస్కులను సరైన విధానంలో ధరిస్తున్నారు. దూరం పాటిస్తున్నారు. శానిటైజర్లను వినియోగిస్తున్నారు. ఎవరి ఇళ్లలో వాళ్లే ఉంటున్నారు. గ్రామంలో ఉంటున్నవారంతా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎవరికీ ఏ రుగ్మత లేకుండా చూసుకుంటున్నారు. పైగా... పెద్దవాళ్లంతా రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇప్పుడు అక్కడ కనీసం ఒక్కరికి కూడా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేనే లేవు!

బాగోకుంటే పునమ్‌ భాయ్‌ వచ్చేస్తాడు.. 

ఒకవేళ గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే... పూనమ్‌ భాయ్‌ అనే వ్యక్తి వెంటనే వస్తాడు. సదరు వ్యక్తిని తన వాహనంపై ఎక్కించుకుని సమీపంలో ఉన్న బెచరాజి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం ఇప్పిస్తాడు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాందని గ్రామ ప్రజలు చూపుతున్న శ్రద్ధ, వారు అనుసరిస్తున్న విధానాల పట్ల ఇతర ప్రాంతాల వారు ఆసక్తి చూపుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని