close

తాజా వార్తలు

తొలి ప్రెస్‌మీట్‌.. చిదంబరం భావోద్వేగం

దిల్లీ: బెయిల్‌పై నిన్న రాత్రి విడుదలైన కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..  పార్లమెంట్‌ భవనం వద్ద కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు. నాతో పనిచేసిన అధికారులు, నన్ను గమనించిన జర్నలిస్టులకు బాగా తెలుసు. ఆర్థిక వ్యస్థను భాజపా ప్రభుత్వం కుప్పకూల్చింది. ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ మాట్లాడటంలేదు. ఉల్లిధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు.. వాటి గురించి పట్టించుకోవడంలేదు ’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మూకదాడుల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆర్థికమందగమనం నుంచి గట్టెక్కవచ్చన్న చిదంబరం.. ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు తిరోగమనంలో ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం తప్పుడు విధానాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనీ.. దేశంలో మీడియా సహా అన్ని వ్యవస్థలూ భయాందోళనలో ఉన్నాయని చిదంబరం వ్యాఖ్యానించారు.  

జైలులో చెక్క బల్లపై నిద్రతో.. 

తీహార్‌ జైలులో ఉండటం వల్ల తన ఆత్మస్థైర్యంతో పాటు శరీరం కూడా గట్టిపడిందని చిదంబరం తెలిపారు. జైలులో ఉన్నన్నాళ్లూ చెక్కబల్లపై నిద్రించడంతో మెడ, వెన్నెముక, తల మరింత దృఢపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్టయినప్పటి నుంచి చిదంబరం దాదాపు 8కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. 

నిన్న రాత్రి బెయిల్‌పై తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యాక చిదంబరం నేరుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. 106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నందుకు ఆనందంగా ఉందని చిదంబరం వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో ఆగస్టు 21న ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.