close

తాజా వార్తలు

బట్టలుతికిన చింపాంజీ... వీడియో వైరల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: అప్పుడప్పుడు మానవులు చేసే పనులను జంతువులు అనుకరించడం మనం చూస్తుంటాం. తాజాగా చైనాలోని ఓ జంతు ప్రదర్శనశాలలోని చింపాంజీ బట్టలుతికి ఔరా అనిపించింది. చైనాలోని చాంగ్‌క్వింగ్‌లో ఉన్న లెహె లెడు థీమ్‌ పార్క్‌లో యుహీ అనే 18ఏళ్ల చింపాంజీ టీ-షర్ట్‌ ఉతుకుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన గురించి యుహీ సంరక్షకురాలు జు మాట్లాడుతూ తను రోజు బట్టలు ఉతికేటప్పడు చింపాజీ తనని చూస్తూ ఉండేదని, దాంతో ఒక రోజు ఆమె చింపాంజీని పరీక్షించాలనే ఆలోచనతో టీ-షర్ట్‌, సోపు, బ్రష్‌ని అక్కడ వదిలి వెళ్లినట్లు తెలిపారు. ‘‘నేను ఎప్పడు యుహీకి బట్టలుతకడం నేర్పించలేదు. నేను ఈ పని చేసేప్పుడు మాత్రం అది నన్ను గమనిస్తుండేది. కానీ అది స్వయంగా బట్టలుతకడం చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని జు అన్నారు.

వీడియోలో చింపాంజీ నీటి గుంట దగ్గర కూర్చొని  మనిషిలానే టీ-షర్టుకు సబ్బు పెట్టి, నీళ్లలో ముంచి ఉతికి  ఆరేయడం అబ్బురపరచింది. ఈ తతంగం మొత్తాన్ని పక్కనే ఇనుప రాడ్లపై కూర్చొని మరో చింపాంజీ చూస్తూ ఎంజాయ్‌ చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. అమెరికన్‌ మ్యూజియమ్‌ ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రకారం ప్రపంచంలోనే చింపాంజీలు అత్యంత తెలివైన జంతు జాతి అని, మానవుల డీఎన్‌ఏకి, చింపాంజీల డీఎన్‌ఏకి 98శాతం దగ్గర పోలికలుంటాయని అధ్యయనంలో వెల్లడయింది.

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.