చైనా వంచ‌న విధాన‌మే ప్ర‌పంచాన్ని ముంచింది!
close

తాజా వార్తలు

Updated : 05/07/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా వంచ‌న విధాన‌మే ప్ర‌పంచాన్ని ముంచింది!

క‌రోనా మ‌హ‌మ్మారికి చైనానే జ‌వాబుదారీ
అమెరికా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో అమెరికా అధ్య‌క్షుడు
డ్రాగ‌న్ దేశంపై మ‌రోసారి విరుచుకుప‌డ్డ ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: ప‌్ర‌పంచ సంక్షోభానికి కార‌ణ‌మైన క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి చైనానే పూర్తి జ‌వాబుదారీగా ఉండాల‌ని అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మ‌రోసారి స్పష్టం చేశారు. చైనా ర‌హ‌స్య‌, వంచ‌న విధానా‌లే క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా వ్యాపించ‌డానికి కార‌ణ‌మయ్యాయ‌ని ఆ దేశంపై విరుచుకుప‌డ్డారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌సంగించిన‌ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'దేశంలో చైనా వైర‌స్ ప్ర‌వేశించి‌నంత‌వ‌ర‌కూ అమెరికా గొప్పగా ప‌నిచేసింది. ఇదివ‌ర‌కు మాస్కులు, గౌన్లు, శ‌స్త్రచికిత్సా ప‌రిక‌రాలను విదేశాల‌నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సి వ‌చ్చేది. ముఖ్యంగా చైనా నుంచే దిగుమ‌తి ఎక్కువ‌గా ఉండేది. కానీ, ప్ర‌స్తుతం అవ‌న్నీ అమెరికానే స్వ‌యంగా ఉత్ప‌త్తి చేస్తోంది' ‌ని అధ్య‌క్షుడు ట్రంప్ వెల్ల‌డించారు. మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో భాగంగా వ్యాక్సిన్‌, ఔష‌ధాల కోసం అమెరికాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కృషి చేస్తోన్న శాస్త్రవేత్త‌లు, ప‌రిశోధ‌కుల‌కు కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అంతేకాకుండా ఈ సంవ‌త్స‌రం చివ‌రినాటికే అమెరికాలో కొవిడ్‌కు చికిత్సా లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా అమెరికా శాస్త్రసాంకేతిక నైపుణ్యాల‌ను డొనాల్డ్ ట్రంప్‌ మ‌రోసారి కొనియాడారు.

ఇవీ చ‌ద‌వండి..
క‌రోనా..అది చైనా ప్లేగు!
ప్రపంచంలో మూడో స్థానానికి భార‌త్‌
ఆగ‌స్టు 15నాటికి క‌రోనా వ్యాక్సిన్‌?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని