close

తాజా వార్తలు

Updated : 11/08/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్య వన్నెతెచ్చారు’

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ: తన పదవీ కాలంలో మూడో ఏడాది కీలకమని, ఆ సమయంలో కీలక బిల్లులకు ఆమోదం లభించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, పౌర సవరణ చట్టం వంటి బిల్లులు ఆమోదం పొందాయన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి ‘కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విడుదల చేశారు. ఈ పుస్తకం డిజిటల్‌ వెర్షన్‌ను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్‌జావడేకర్‌ ఆవిష్కరించారు. 

250 పేజీల ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖకు చెందిన ప్రచురణల విభాగం రూపొందించింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, ఇతర ముఖ్యకార్యక్రమాలన్నింటికీ ఇందులో స్థానం కల్పించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన చేపట్టిన సంస్కరణలతోపాటు, ఎగువ సభ కార్యకలాపాల ఉత్పాదకతను ఎలా పెంచిందీ ఇందులో వివరించారు. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మిషన్‌ కనెక్ట్‌ పేరుతో ఆయన పాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సుదీర్ఘ సహచరులు, బంధువులు, ఆధ్యాత్మిక గురువులు, పాత్రికేయులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్న విషయాన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తదితరులు వెంకయ్యకు అభినందనలు తెలిపారు.

పుస్తకావిష్కరణ అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ...ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్యనాయుడు వన్నెతెచ్చారని అభినందించారు. కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వెంకయ్య నాయుడు మాటల్లోనూ కళాత్మకత ఉంటుందన్నారు.  వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. గత మూడేళ్లలో రాజ్యసభ చాలా మారింది, సభ పనిచేసే సమయం పెరిగిందన్నారు. రాజ్యసభలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ముఖ్యమైన బిల్లులపై సమగ్ర చర్చకు అవకాశం లభించిందన్నారు.

‘‘మొదట్నుంచీ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నా. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. త్వరలోనే సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నా. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు, అవిష్కరణలు రావాలి. నూతన ఆవిష్కరణల్లో యువత పాత్ర కీలకం కావాలి. జన్మభూమి రుణం తీర్చుకునేలా యువత కార్యక్రమాలు చేపట్టాలి. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి రావాలి. ఆర్థిక స్థిరత్వానికి ఇటీవల కాలంలో చాలా చర్యలు తీసుకున్నారు’’ అని వెంకయ్యనాయుడు వివరించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.