
తాజా వార్తలు
కొవిడ్ టీకాపై భారత్‌తోనూ సంప్రదింపులు: ఫైజర్
లండన్: ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్‌లో అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీంతో ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి ఉన్న అవకాశాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫైజర్ వెల్లడించింది.
‘ఇప్పటికే బ్రిటన్‌లో అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇందులో భాగంగా, భారత్‌తోనూ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఫైజర్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులో తేవడమే లక్ష్యంగా ఫైజర్ పనిచేస్తోందని.. దీనిపై ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని ఫైజర్ ప్రతినిధి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వాలతో ఒప్పందం ప్రకారమే ఫైజర్ ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగానే తమ సంస్థ నడుచుకుంటుందని ఫైజర్ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.
ఆ ఉష్ణోగ్రతల వద్ద కష్టమే..!
భారత్‌లో వ్యాక్సిన్‌ను అందుబాటులో తేవడానికి ఫైజర్ ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. ఈ వ్యాక్సిన్‌ను అతి తక్కువ ఉష్ణోగ్రతల(-70 డిగ్రీలు) వద్ద నిల్వ ఉంచడమే ప్రధాన సమస్య అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ మధ్యే పేర్కొన్నారు. కరోనాపై భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ టాస్క్‌ఫోర్స్‌కు వీకే పాల్ నేతృత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి వస్తే.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వీకే పాల్ తెలిపారు. వ్యాక్సిన్ భారత్‌లోకి రావడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో యూకే, అమెరికా దేశాల్లో తొందరలోనే అందుబాటులోకి రానున్నప్పటికీ..భారత్‌లో మాత్రం కష్టంగానే కనిపిస్తోంది.
ఇదిలాఉంటే, భారత్‌లో తుదిదశ ప్రయోగాల్లో ఉన్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి మరో రెండు వారాల్లోనే దరఖాస్తు చేసుకుంటామని సీరం ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఇక ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో కలిసి భారత్ బయోటెక్ తయారుచేసిన మరో వ్యాక్సిన్‌పై కూడా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశానికి ఫైజర్ వ్యాక్సిన్ అవసరం ఏమేరకు ఉంటుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్ జోరు: యూకేకు భారతీయుల పరుగులు
టీకా సమాచారంపై ఉ.కొరియా హ్యాకర్ల దాడి..!
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
