‘సుధామూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలా?’

తాజా వార్తలు

Published : 26/10/2020 21:28 IST

‘సుధామూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలా?’

వెబ్‌సిరీస్‌ దర్శకుడు, నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు 

బెంగళూరు: ఓ వెబ్‌ సిరీస్‌లో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. వెబ్‌ సిరీస్‌ నిర్వాహకులపై నమ్మ కర్ణాటక రక్షణ వేదిక నేత లయన్‌ జయరాజ్‌ నాయుడు నందిని లే అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనేక సేవా కార్యక్రమాలతో కర్ణాటకకు గర్వకారణంగా నిలిచే సుధామూర్తిపై ‘ఓల్డ్‌ టౌన్‌ క్రిమినల్‌’ వెబ్‌ సిరీస్‌లో అవమానించే రీతిలో వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ దర్శకుడు అమర్‌, నిర్మాత మోహన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా జయరాజ్‌ మాట్లాడుతూ.. ఎంతోమందికి సాయం చేస్తున్న సుధామూర్తిలాంటి వాళ్లపై దుర్భాషలాడటం సరికాదన్నారు. అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదుపై సుధామూర్తికి తాము సమాచారం ఇవ్వలేదని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని