close

తాజా వార్తలు

సిద్ధరామయ్యకు అస్వస్థత

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం దమనుల్లో ఏర్పడిన బ్లాక్‌ను తొలగించేందుకు సిద్ధరామయ్యకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనకు ఆంజియోప్లాస్టీ శస్త్ర చికిత్స చేశారు. ఇదివరకే ఓ సారి సిద్ధరామయ్య ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 8న ఆయన వ్యాయామం చేస్తుండగా అసౌకర్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కూడా వ్యాయామం చేస్తుండగా మరోసారి నొప్పివచ్చింది. బుధవారం నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు యతీంద్ర ధ్రువీకరించారు.  

తన ఆరోగ్య విషయంపై వస్తున్న వార్తలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘డాక్టర్‌ సలహా మేరకు ఆంజియోప్లాస్టీ చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాను. గురువారం ఇంటికి వెళ్లి కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. చింతించాల్సిన అవసరం లేదు’’ అని ట్విట్‌ చేశారు. అనారోగ్యం రిత్యా డిసెంబరు 14న దిల్లీలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరగనున్న ‘భారత్‌ బచావ్‌’ ర్యాలీకి సిద్ధరామయ్య హాజరు కావడం లేదు. 

ఇటీవల వెల్లడైన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య తన సీఎల్పీ పదవికి రాజీనామా సంగతి తెలిసిందే. ఆయనతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు సైతనం తన పదవికి రాజీనామా సమర్పించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.