దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 11/10/2020 10:11 IST

దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు

దిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షల మార్కును దాటేసింది. శనివారం 10,78,544 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 74,383 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,53,807కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారితో 918 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,08,334కి పెరిగింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో 8,67,496 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 60,77,997 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు బులిటెన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,68,77,242 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని