
తాజా వార్తలు
అమెరికాలో కరోనా కరాళ నృత్యం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో 849 మంది మృతి చెందారు. అమెరికాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 32,91,786కి చేరగా మృతుల సంఖ్య 1,36,671కి పెరిగింది. ఫ్లోరిడార్, టెక్సాస్, కాలిఫోర్నియాలో వైరస్ వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజుకు లక్షకు పైగా కేసులు నమోదయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు అభిప్రాపడుతున్నారు. ఇప్పటి వరకు 14,60,465 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.
Tags :