చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్‌

తాజా వార్తలు

Published : 22/05/2020 09:05 IST

చైనాను అంత తేలిగ్గా తీసుకోం: ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా నుంచే వచ్చిందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. చైనాతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని.. కానీ, కొన్ని రోజులకే ఆ దేశం నుంచి వైరస్‌ వచ్చిపడటం తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. గురువారం ఆఫ్రికన్‌-అమెరికన్‌ నేతలతో మిషిగన్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది(కరోనా వైరస్‌) చైనా నుంచే వచ్చింది. దీనిపై మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. ఈ మధ్యే ఓ ఒప్పందంపై సంతకాలు చేశాం. ఆ సిరా కూడా ఆరకముందే వైరస్‌ వచ్చి పడింది. దీన్ని మేం ఏ మాత్రం తేలిగ్గాం తీసుకోబోం’’

    -డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

గత కొన్ని రోజులుగా వైరస్‌ వ్యాప్తి విషయంలో ట్రంప్‌.. చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చట్టసభ ప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. చైనాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రధానంగా రిపబ్లిన్‌ పార్టీ ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. చైనా తప్పిదం వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి తలెత్తిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాగన్‌పై కఠిన ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. అయితే, ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే అంశంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంతాపంగా జెండా అవనతం..

కొవిడ్‌-19తో పోరాడుతూ మరణించిన వారి సంఖ్య 95వేలు దాటిన నేపథ్యంలో వారందరికీ సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని ట్రంప్‌ ఆదేశించారు. అన్ని జాతీయ కార్యాలయాలు, చారిత్రక ప్రదేశాలు సహా ఇతర ప్రముఖ స్థలాల్లో ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయాలని కోరారు. మృతుల సంఖ్య లక్ష దాటుతున్న నేపథ్యంలో వారందరి గౌరవార్థం ఈ చర్యను చేపట్టాలని డెమొక్రటిక్‌ సభ్యుల నుంచి డిమాండ్‌ వచ్చిన నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి..

ఒక్కరోజే లక్ష కేసులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని