భారత్‌లో కరోనా కల్లోలం: రికార్డుస్థాయి కేసులు

తాజా వార్తలు

Updated : 03/09/2020 10:25 IST

భారత్‌లో కరోనా కల్లోలం: రికార్డుస్థాయి కేసులు

రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికం
దేశంలో 38లక్షలు దాటిన కేసులు, 67వేల మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు.. గత 24గంటల్లోనే అత్యధికంగా 11.70లక్షల శాంపిల్స్‌ను పరీక్షించగా 83,883 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 38లక్షల 53వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 29.70లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్సపొందుతున్నారు. నిన్న మరో 68వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.1శాతానికి చేరింది. కొవిడ్‌ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 1043 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 67,376కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.

దేశంలో కరోనా పరిస్థితిపై ఇన్ఫోగ్రాఫ్‌..

ఇవీ చదవండి..
‘రెండోసారి కరోనా’ భయం వద్దు..!
పరివర్తనం వ్యాక్సిన్‌కు ప్రతిబంధకం కాబోదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని