తమిళనాట మరో 89 మంది మృతి 

తాజా వార్తలు

Published : 26/07/2020 02:59 IST

తమిళనాట మరో 89 మంది మృతి 

చెన్నై: తమిళనాడులో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, మరణాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మరో 89మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3409కి పెరిగింది. తమిళనాడులో కేసులు 2 లక్షలు దాటేశాయి. గడిచిన 24గంటల్లో 64,315 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6988 కేసులు నమోదయ్యాయి. ఒక్క  చెన్నై నగరంలోనే 24గంటల్లో 20 మరణాలు, 1329 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,06,737కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,87,334 మందికి టెస్ట్‌లు చేశారు.

ఒక్కరోజే 7758 మంది డిశ్చార్జి..

మరోవైపు, కరోనాతో పోరాడి బయటపడుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ ఒక్కరోజే 7758 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా  డిశ్చార్జి అయినవారి సంఖ్య 1,51,055కి పెరిగింది. రాష్ట్రంలో రికవరీ రేటు 73% ఉండగా.. మరణాల రేటు 1.64%గా ఉంది. తమిళనాడులో మొత్తం 115 ల్యాబ్‌లలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,273 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని