close

తాజా వార్తలు

Updated : 16/05/2020 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో 85వేల కేసులు, 2752 మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్‌ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరగా 2752 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 30,153 మంది కోలుకోగా మరో 53,035 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.

మహారాష్ట్రలో 1068, గుజరాత్‌లో 606మరణాలు..

కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లలో మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ప్రతిరోజు కొత్తగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1576పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 29,100కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ సోకిన వారిలో 1068 మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్‌లోనూ మరణాల రేటు కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9931 కేసులు నమోదు కాగా 606మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 4595 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 239మంది మరణించారు.

తమిళనాడులో 10వేలు దాటిన కరోనా కేసులు...

తమిళనాడులో కరోనా తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌ కరోనా వ్యాప్తికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 434మంది ఈవైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10,108కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 71మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 2461 కేసులు నమోదుకాగా 225మంది మృత్యువాతపడ్డారు. రాజస్థాన్‌లో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 125కు చేరగా ఇప్పటివరకు మొత్తం 4727 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో 2307, తెలంగాణలో 1454 కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో నిన్న కొత్తగా 40 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1454కి చేరగా ఇప్పటివరకు 34మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న అత్యధికంగా 102పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2307కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 48మంది చనిపోయారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.