భారత్‌లో 9వేలు దాటిన కరోనా మరణాలు!
close

తాజా వార్తలు

Updated : 14/06/2020 11:31 IST

భారత్‌లో 9వేలు దాటిన కరోనా మరణాలు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 300లకుపైగా కొవిడ్‌-19 మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 311 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మరణించినవారి సంఖ్య 9195కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అంతేకాకుండా, కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదివేలకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,929 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 3,20,922కు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379మంది కోలుకోగా మరో 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

ఇదిలాఉంటే, కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. 9650 మరణాలతో బెల్జియం 8వ స్థానంలో ఉండగా, 8867మరణాలతో జర్మనీ 10స్థానంలో కొనసాగుతోంది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని