close
Array ( ) 1

తాజా వార్తలు

భారత్‌లో 166కి చేరిన కరోనా మరణాలు!

5734కి చేరిన పాజిటివ్‌ కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు అధికమౌతోంది. గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5734కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 166మంది మరణించగా 5095మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 473మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు.

గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 17 మరణాలతోపాటు పాజిటివ్‌ కేసులు భారీగా నమోదయ్యాయి. రానున్నరోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 72మంది  మృత్యువాతపడగా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 1135కి చేరింది.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు..

రాష్ట్రం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర     1135 117 72
గుజరాత్‌ 179 25 16
మధ్యప్రదేశ్‌ 229 0 13
తెలంగాణ 453 45 11
దిల్లీ 669 21 9
తమిళనాడు 738 21 8
పంజాబ్‌ 101 4 8
కర్ణాటక 181 28 5
పశ్చిమ బెంగాల్‌ 103 16 5
ఉత్తర్‌ప్రదేశ్‌ 361 27 4
ఆంధ్రప్రదేశ్‌ 348 6 4
జమ్మూకశ్మీర్‌ 158 4 4
రాజస్థాన్‌ 381 21 3
కేరళ 345 83 2

తెలంగాణలో కొత్తగా 49కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 453కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.