ఆసియాలో లక్ష దాటిన కరోనా మరణాలు!

తాజా వార్తలు

Published : 03/09/2020 19:09 IST

ఆసియాలో లక్ష దాటిన కరోనా మరణాలు!

దిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి‌ ధాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే యూరప్‌, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు తీవ్ర ప్రభావాన్ని చవిచూస్తున్నాయి. అక్కడ ఆందోళనకర స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆసియాలోనూ వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గురువారం నాటికి ఆసియా దేశాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య దాదాపు 54లక్షలు దాటగా మరణాల సంఖ్య లక్ష దాటింది. వీటిలో అత్యధిక మరణాలు భారత్‌లోనే సంభవించాయి. ఇప్పటివరకు దేశంలో 67,376 కొవిడ్‌ మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్‌ మరణాల్లో భారత్‌ తర్వాతి స్థానంలో ఇండోనేషియా ఉంది. ఇక్కడ ఇప్పటివరకు లక్షా 80వేల కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య 7,616కు చేరింది. పాకిస్థాన్‌లోనూ 6,328 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనావైరస్ కేంద్రబిందువైన చైనాలో మాత్రం 89వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 4727 మరణాలు సంభవించాయి.

ఇదిలాఉంటే, కరోనా మరణాలు అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకుంటున్నాయి. కేవలం ఒక్క అమెరికాలోనే లక్షా 85వేల మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దక్షిణ అమెరికాలో తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఒక్క బ్రెజిల్‌లోనే లక్షా 23వేల మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే లాటిన్‌ అమెరికా మొత్తం దేశాల్లో కరోనా మరణాల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. వీటి తర్వాత ఆసియా ప్రాంతంలో అత్యధిక తీవ్రత భారత్‌లోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల రేటు దాదాపు 3శాతం ఉండగా భారత్‌లో అది 1.7శాతం ఉంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని