భారత్‌లో 12వేలకు చేరువలో కరోనా మరణాలు!
close

తాజా వార్తలు

Updated : 17/06/2020 09:53 IST

భారత్‌లో 12వేలకు చేరువలో కరోనా మరణాలు!

మహారాష్ట్రలో 5537కి చేరిన మృతులు

 దేశంలో 17రోజుల్లోనే రెట్టింపైన కేసులు, మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి మృత్యు కేళి మోగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2003మంది కరోనా మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 1409 కొవిడ్‌ మరణాలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో గత రెండు నెలలుగా పెండింగులో ఉన్న మరణాల సంఖ్యను చేర్చడంతో ఈ సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం. దీంతో బుధవారం నాటికి దేశంలో కొవిడ్‌-19 మరణాల సంఖ్య 11,903కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా మరణాల రేటు 3.4 శాతానికి పెరిగింది. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,974 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,54,065కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,86,935మంది కోలుకోగా మరో 1,55,227మంది చికిత్స పొందుతున్నారు.

17రోజుల్లోనే రెట్టింపు..

దేశంలో గడచిన 17రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రెట్టింపు అయ్యింది. మే 31తేదీ వరకు దేశంలో లక్షా 82వేల పాజిటివ్‌ కేసులు, 5164 మరణాలు నమోదయ్యాయి. కాగా జూన్‌ 17నాటికి కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. 

ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలోనే నిత్యం పదివేల చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని