క్రిస్మస్‌ వేడుకలపై కరోనా ప్రభావం 

తాజా వార్తలు

Updated : 25/12/2020 14:38 IST

క్రిస్మస్‌ వేడుకలపై కరోనా ప్రభావం 

విదేశీ యాత్రికులు లేక బోసిపోయిన బెత్లెహాం వీధులు

బెత్లెహాం: క్రీస్తు జన్మస్థలమైన బెత్లెహాం నగరం బోసిపోయింది. రక్షకుడు జన్మించాడంటూ గురువారం ఈ పురవీధుల్లో సంగీతనాదాలు వినిపించిన బృందాలకు... చాలా తక్కువ మందే స్వాగతం పలికారు. ఏటా క్రిస్మస్‌ నాడు బెత్లెహాం కిక్కిరిసిపోయేది. కరోనా కారణంగా విమానాల రాకపోకలు రద్దు కావడంతో, ఈసారి వేడుకలకు విదేశీ యాత్రికులు రాలేకపోయారు. మహమ్మారి కారణంగా ఇప్పటికే ఇక్కడి రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి.
‘‘ఎన్నో అవాంతరాలు నెలకొన్నా, వివిధ దేశాల నుంచి పర్యాటకులు రాలేకపోయినా బెత్లెహాంలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తున్నాం. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం’’ అని మేయర్‌ ఆంటోన్‌ సాల్మన్‌ చెప్పారు. బెత్లెహాంలోని క్యాథలిక్‌ పుణ్యక్షేత్రంలో కొద్దిమంది మాత్రమే ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ (85) అబ్బాస్‌ ఈసారి క్రిస్మస్‌ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల క్రిస్మస్‌ వేడుకలకు తక్కువ సంఖ్యలోనే జనం హాజరవుతున్నారు. కొన్నిచోట్ల సామూహిక ఆరాధనలను రద్దు చేయగా, చాలాచోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను ప్రార్థనలకు అనుమతిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని చర్చిల్లో దూరం దూరంగా నిలబడి ప్రార్థనల్లో పాల్గొనడానికి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు. వాటికన్‌లో దాదాపు ఖాళీగా ఉన్న చర్చిలోనే పోప్‌ ప్రార్థనలు నిర్వహించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని