భార‌త్‌లో ఒక్క‌రోజే 28,637 కేసులు!
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార‌త్‌లో ఒక్క‌రోజే 28,637 కేసులు!

24గంట‌ల్లో 551 మ‌ర‌ణాలు
మ‌హారాష్ట్రలో 10వేలు దాటిన కొవిడ్‌ మ‌ర‌ణాలు

దిల్లీ: భార‌త్‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. గ‌త కొన్నిరోజులుగా నిత్యం 25వేల‌కుపైగా రికార్డుస్థాయి కేసులతో మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 28,637 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,49,553కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. నిన్న 551మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం ఉద‌యానికి కొవిడ్‌తో మ‌ర‌ణించిన వారిసంఖ్య 22,674గా న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. దేశంలో క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌రకు 5,34,621 మంది కోలుకోగా మ‌రో 2,92,258 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క‌రోజే 19,235మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో కరోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 62.78శాతంగా ఉండ‌టం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం. క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డిచేయ‌డంలో భాగంగా దేశంలో ప‌లుచోట్ల మ‌రోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా బెంగ‌ళూరులో ఈ నెల 14నుచి 22వ తేదీవ‌రకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు.

మహారాష్ట్రలో 10వేల మ‌ర‌ణాలు..
క‌రోనా వైర‌స్ ఉద్ధృతి మ‌హారాష్ట్రలో కొన‌సాగుతూనే ఉంది. అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాల‌తో అక్క‌డ‌ ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిత్యం రాష్ట్రంలో కొత్త‌గా 7వేలకుపైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క‌రోజే 8139 పాజిటివ్ కేసులు, 223 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,600కు చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌రకు 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సంభ‌విస్తోన్న కొవిడ్ మ‌ర‌ణాల్లో దాదాపు 44శాతం మ‌హారాష్ట్రలోనే చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

త‌మిళ‌నాడు, దిల్లీలో కొన‌సాగుతున్న ఉద్ధృతి..
మ‌హారాష్ట్ర అనంత‌రం అత్య‌ధిక కేసులు త‌మిళ‌నాడులో న‌మోద‌వుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా నిన్న 3965పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,34,226కు చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌రకు 1898 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఇక దేశ ‌రాజ‌ధానిలోనూ నిన్న 1781కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,921గా న‌మోదైంది. దిల్లీలో ఇప్ప‌టివ‌రకు 3334 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని